Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 6

Release Notes

Red Hat Enterprise Linux 6.5 కొరకు విడుదల నోట్స్

Edition 5

Red Hat ఇంజినీరింగ్ కాంటెంట్ సర్వీసెస్


Legal Notice

Copyright © 2013 Red Hat, Inc.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
 RaleighNC 27606-2072 USA
 Phone: +1 919 754 3700
 Phone: 888 733 4281
 Fax: +1 919 754 3701

Abstract
Red Hat Enterprise Linux 6.5 నందు ఇంప్లిమెంట్ చేసిన మెరుగుదలలు మరియు చేర్పుల కవరేజ్‌ను విడుదల నోట్స్ అందించును. Red Hat Enterprise Linux 6.5 నవీకరణకు చెందిన అన్ని మార్పులపై విశదీకృత పత్రకీకరణ కొరకు, సాంకేతిక నోట్స్ చూడండి.

ముందుమాట
1. కెర్నల్
2. నెట్వర్కింగ్
3. రక్షణ
4. సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ
5. వర్చ్యులైజేషన్
5.1. KVM
5.2. Microsoft Hyper-V
5.3. VMware
6. నిల్వ
7. క్లస్టరింగ్
8. హార్డువేర్ చేతనపరచుట
9. పరిశ్రమ ప్రమాణాలు మరియు ధృవీకరణం
10. డెస్కుటాప్ మరియు గ్రాఫిక్స్
11. పనితనం మరియు స్కేలబిలిటి
12. కంపైలర్ మరియు సాధనములు
A. కాంపోనెంట్ వర్షన్లు
B. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

ముందుమాట

Red Hat Enterprise Linux చిన్న విడుదల అనునది స్వతంత్ర విస్తరింపులు, రక్షణ మరియు బగ్ పరిష్కారం ఎర్రాటా యొక్క సమాహారం. ఈ చిన్న విడుదలనందు Red Hat Enterprise Linux 6 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు దాని తోటి అనువర్తనాలకు చేసిన ముఖ్య మార్పులు గురించి Red Hat Enterprise Linux 6.5 విడుదల నోట్స్ పత్రకీకరణ చేసెను. ఈ చిన్న విడుదల నందు చేసిన మార్పులు (అనగా, బగ్ పరిష్కారాలు, జతచేసిన విస్తరింపులు, మరియు తెలిసిన విషయాలు) పై విశదీకృత నోట్స్ ఇక్కడ అందుబాటులో వున్నాయి. Technical Notes. సాంకేతిక నోట్స్ పత్రము నందు ప్రస్తుతం అందుబాటులో వున్న సాకేంతిక ముందస్తువీక్షణలను అవి అందించే ప్యాకేజీలతో సహా జాబితా చేయును.

ముఖ్యమైన

ఆన్‌లైన్ Red Hat Enterprise Linux 6.5 విడదల నోట్స్, ఆన్‌లైన్ నందు ఇక్కడ వున్నవి, ఖచ్చితమైనవిగా, సరికొత్త వర్షన్‌గా పరిగణించాలి. విడదలకు సంబందించి ప్రశ్నలువున్న వినియోగదారులు వారి Red Hat Enterprise Linux వర్షన్‌కు చెందిన ఆన్‌లైన్ విడుదల మరియు సాంకేతిక నోట్స్ సంప్రదించమని సూచించడమైంది.
Red Hat Enterprise Linux పరిణామ చక్రం గురించి మీకు సమాచారం కావలెనంటే, https://access.redhat.com/support/policy/updates/errata/ చూడండి.

Chapter 1. కెర్నల్

Red Hat Enterprise Linux 6.5 నందు అందించుచున్న కెర్నల్ వందల కొద్ది బగ్ పరిష్కారాలను, మరియు విస్తరింపులను లైనక్స్ కెర్నల్ కు కలిగివుంది. ఈ విడుదల నందు కెర్నల్ కు జతచేసిన బగ్ పరిష్కారాలు మరియు విస్తరింపులపై వివరాల కొరకు, Red Hat Enterprise Linux 6.5 Technical Notes యొక్క కెర్నల్ విభాగమును చూడండి.

PMC-Sierra కార్డ్స్ మరియు నియంత్రికల కొరకు తోడ్పాటు

PMC-Sierra Adaptec Series 6H మరియు 7H SAS/SATA HBA కార్డ్స్ అదేవిదంగా PMC Sierra 8081, 8088, మరియు 8089 చిప్ ఆధారిత SAS/SATA నియంత్రికల కొరకు pm8001/pm80xx డ్రైవర్ తోడ్పాటును జతచేయును.

స్పందించని పరికరాల కొరకు గడువుముగింపును ఆకృతీకరించు

కొన్ని నిల్వ ఆకృతీకరణలు (ఉదాహరణకు, చాలా LUNల తో ఆకృతీకరణలు) నందు, SCSI దోష సంభాలన కోడ్ అనునది స్పందించని నిల్వ పరికరాలకు TEST UNIT READY వంటి ఆదేశాలను ఇస్తూ పెద్ద మొత్తంలో సమయం వెచ్చిస్తుంది. కొత్త sysfs పారామితి, eh_timeout, అనునవి SCSI పరికర ఆబ్జక్టునకు జతచేయబడెను, అది SCSI దోష సంభాలన కోడ్ చేత వుపయోగించు TEST UNIT READY మరియు REQUEST SENSE ఆదేశాల కొరకు గడువుముగింపు విలువను ఆకృతీకరించుటకు అనుమతించును. అది ఈ స్పందించని పరికరాలను పరిశీలిస్తూ వెచ్చించే సమయాన్ని తగ్గిస్తుంది. eh_timeout యొక్క అప్రమేయ విలువ 10 క్షణాలు, అది ఈ ఫంక్షనాలిటి జతచేయకముందు వుపయోగించిన గడువుముగింపు విలువ.

ఎర్రర్ రికవరీ కొరకు గరిష్ట సమయ ఆకృతీకరణ

SCSI అతిధేయ ఆబ్జక్టు కొరకు కొత్త sysfs పారామితి eh_deadline జతచేయబడెను, ఇది మొత్తం అతిధేయ బల్ ఎడాప్టర్ (HBA) ను తిరిగివుంచుటకు ముందుగా, SCSI దోష సంభాలన ఎంత సమయం ఎర్రర్ రికవరీ కొరకు ప్రయత్నించాలో ఆ గరిష్ట సమయం ఆకృతీకరిస్తుంది. ఈ పారామితి యొక్క విలువ క్షణాలలో తెలుపబడును, అప్రమేయంగా సున్నా, అది సమయం పరిమితిని అచేతనంచేసి మొత్త ఎర్రర్ రికవరీ జరుగునట్లు చేస్తుంది. sysfs వుపయోగించుటకు అదనంగా, eh_deadline కెర్నల్ పారామితిని వుపయోగిస్తూ అన్ని SCSI HBAల కొరకు అప్రమేయ విలువ అమర్చవచ్చు.

Lenovo X220 టచ్‌స్క్రీన్ తోడ్పాటు

Red Hat Enterprise Linux 6.5 ఇప్పుడు Lenovo X220 టచ్‌స్క్రీన్‌కు తోడ్పాటునిచ్చును.

Chapter 2. నెట్వర్కింగ్

ప్రెసిషన్ టైమ్ ప్రొటోకాల్

IEEE ప్రమాణికం 1588-2008 అనుసరించి లైనక్స్ కొరకు Red Hat Enterprise Linux 6.4 నందు ప్రెసిషన్ టైమ్ ప్రొటోకాల్ (PTP) అనునది సాంకేతిక ముందస్తు వీక్షణం వలె అభివృద్ది చేయబడెను. PTP వ్యవస్థీకరణం, కెర్నల్ మరియు వాడుకరి స్పేస్ రెంటికీ, Red Hat Enterprise Linux 6.5 నందు పూర్తిగా తోడ్పాటునిస్తోంది. నెట్వర్కు డ్రైవర్ టైమ్ స్టాంపింగ్ తోడ్పాటు యిప్పుడు కింది డ్రైవర్లను కూడా కలిగివుంది: bnx2x, tg3, e1000e, igb, ixgbe, మరియు sfc.

ఆకృతీకరణ-కాని ఐపి మల్టీకాస్ట్ IGMP స్నూపింగ్ దత్తాంశం విశ్లేషణ

గతంలో, బ్రిడ్జ్ మాడ్యూల్ sysfs అవాస్తవ ఫైల్ వ్యవస్థ అనునది ఆకృతీకరించని ఐపి మల్టీకాస్ట్ ఇంటర్నెట్ గ్రూప్ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్ (IGMP) స్నూపింగ్ దత్తాంశం తనిఖీ చేయగల సామర్ధ్యం కలిగిలేదు. ఈ ఫంక్షనాలిటీ లేకుండా, వాడుకరులు వారి మల్టీకాస్ట్ ట్రాఫిక్‌ను పూర్తిగా విశ్లేషించలేరు. Red Hat Enterprise Linux 6.5 నందు, వాడుకరులు గుర్తించిన మల్టీకాస్ట్ రూటర్ పోర్టులను, క్రియాశీల సబ్‌స్క్రైబర్లతో వున్న సమూహాలను మరియు సంబందిత ఇంటర్ఫేసులను జాబితా చేయగలరు.

నెట్వర్కునిర్వాహిక నందు PPPoE అనుసంధానాల తోడ్పాటు

ఈథర్నెట్ (PPPoE) ఆధారిత అనుసంధానల నందు పాయింట్-టు-పాయింట్ ప్రొటోకాల్ సృష్టించుట మరియు నిర్వహించుటకు తోడ్పాటునిచ్చుటకు నెట్వర్కునిర్వాహిక విస్తరించబడెను; ఉదాహరణకు, DSL, ISDN, మరియు VPN అనుసంధానత కొరకు అనుసంధానాలు.

ఓపెన్‌స్టాక్ కొరకు నెట్వర్కు నేమ్‌స్పేస్ తోడ్పాటు

నెట్వర్కు నేమ్‌స్పేసెస్ (netns) అనునది లైట్‌వెయిట్ కంటైనర్-ఆధారిత వర్చ్యులైజేషన్ సాంకేతికత. అవాస్తవ నెట్వర్కు స్టాక్ అనునది ప్రోసెస్ సమూహంతో సంబందించి వుండును. ప్రతి నేమ్‌స్పేస్ దాని స్వంత లూప్‌బాక్ పరికరం మరియు ప్రోసెస్ స్పేస్ కలిగివుండును. అవాస్తవ లేదా వాస్తవ పరికరాలు ప్రతి నెట్వర్కు నేమ్‌స్పేస్‌కు జతచేయగలం, మరియు వాడుకరి ఐపి చిరునామాలను ఈ పరికరాలకు కేటాయించి మరియు వాటిని నెట్వర్కు నోడ్ వలె వుపయోగించగలరు.

క్రిప్టోగ్రఫీ హాష్ ఫంక్షన్ మార్చుటకు SCTP తోడ్పాటు

Red Hat Enterprise Linux 6.5 నందు, స్ట్రీమ్ కంట్రోల్ ట్రాన్సుమిషన్ ప్రొటోకాల్ (SCTP) అనుసంధానాల కొరకు వాడుకరులు క్రిప్టోగ్రఫీ హాష్ ఫంక్షన్‌ను MD5 నుండి SHA1 కు మార్చగలరు.

SCTP కొరకు M3UA మెజర్‌మెంట్ కౌంటర్స్

మెసేజ్ ట్రాన్సఫర్ పార్ట్ లెవల్ 3 యూజర్ ఎడాప్షన్ లేయర్ (M3UA) అనునది సాంప్రదాయ టెలీకమ్యునికేషన్స్ నెట్వర్క్స్ (ISDN మరియు PSTN) వుపయోగించుటకు బదులుగా స్ట్రీమ్ కంట్రోల్ ట్రాన్సుమిషన్ ప్రొటోకాల్ (SCTP) వుపయోగించి ఐపి నందు MTP లెవల్ 3 యూజర్ పార్ట్ సిగ్నలింగ్ సందేశాలను ట్రాన్సుపోర్టు చేయుటకు IETF చేత నిర్వచించబడిన ఒక ప్రొటోకాల్.

iproute వుపయోగించి DOVE టన్నెల్స్ నిర్వహించుట

డిస్ట్రిబ్యూటెడ్ వోవర్లే వర్చ్యువల్ ఈథర్నెట్ (DOVE) టన్నెల్స్ అనునవి వర్చ్యువల్ ఎక్సుటెన్సిబుల్ లోకల్ ఏరియా నెట్వర్కు (VXLAN) నిర్మించుట కొరకు అనుమతించబడును, అవి క్లౌడ్ కేంద్రాల నందు ISO OSI లేయర్ 2 నెట్వర్కుల కొరకు స్కేలబుల్ పరిష్కారాలను ఇచ్చును. bridge సాధనం అనునది iproute ప్యాకేజీ నందు భాగము, ఉదాహరణకు, లైనక్స్ ప్లాట్‌ఫాం పైన VXLAN పైన ఫార్వార్డింగ్ డాటాబేస్ నిర్వహించుటకు.

Chapter 3. రక్షణ

FIPS 140-2 ధృవీకరణపత్రంకు సంభందించిన మార్పులు

Red Hat Enterprise Linux 6.5 నందు, dracut-fips ప్యాకేజీ వున్నప్పుడు ఇంటిగ్రిటీ తనిఖీ జరుపబడును, కెర్నల్ FIPS రీతినందు పనిచేస్తోందా లేదా అనేది పట్టించుకోకుండా. Red Hat Enterprise Linux 6.5 ను FIPS 140-2 సారూప్యమైనదిగా ఎలా చేయాలి అనేదానిపై, కింది సమాచార నిధి పరిష్కారమును సంప్రదించండి:

OpenSSL అనునది వర్షన్ 1.0.1 కు నవీకరించబడెను

GlusterFS నందు పారదర్శక ఎన్క్రిప్షన్ మరియు ధృవీకరణ తోడ్పాటుకు అవసరమైన కింది సైఫర్లను ఈ నవీకరణ జతచేయును:
  • CMAC (సైఫర్-ఆధారిత MAC)
  • XTS (సైఫర్‌టెక్ట్స్ స్టీలింగ్ తో XEX ట్వీకబుల్ బ్లాక్ సైఫర్)
  • GCM (గలోయిస్/కౌంటర్ రీతి)

OpenSSH నందు స్మార్టుకార్డ్ తోడ్పాటు

OpenSSH ఇప్పుడు PKCS #11 ప్రమాణంతో సారూప్యమగును, ఇది ధృవీకరణ కొరకు OpenSSH స్మార్టుకార్డు వుపయోగించునట్లు చేయును.

OpenSSL నందు ECDSA తోడ్పాటు

ఎలిప్టిక్ కర్వ్ డిజిటల్ సిగ్నేచర్ అల్గార్దెమ్ (ECDSA) అనునది డిజిటల్ సిగ్నేచర్ అల్గార్దెమ్ (DSA) యొక్క వేరియంట్ ఇది ఎలిప్టిక్ కర్వ్ క్రిప్టోగ్రఫీ (ECC) వుపయోగించును. nistp256 మరియు nistp384 కర్వులు మాత్రమే తోడ్పాటునిచ్చునని గమనించండి.

OpenSSL నందు ECDHE తోడ్పాటు

ఎఫెమెరల్ ఎలిప్టిక్ కర్వ్ డిఫైన్-హెల్మన్ (ECDHE) తోడ్పాటు వుంది, ఇది తక్కువ కంప్యుటేషనల్ అవసరాలతో ఖచ్చితమైన ఫార్వార్డ్ సీక్రసీ అనుమతించును.

OpenSSL మరియు NSS నందు TLS 1.1 మరియు 1.2 తోడ్పాటు

OpenSSL మరియు NSS ఇప్పుడు ట్రాన్సుపోర్టు లేయర్ సెక్యూరిటీ (TLS) ప్రొటోకాల్ యొక్క సరికొత్త వర్షన్లకు తోడ్పాటునిచ్చును, అది నెట్వర్కు అనుసంధానాల భద్రతను పెంచును మరియు ఇతర TLS ప్రొటోకాల్ ఇంప్లిమెంటేషన్లతో పూర్తి ఇంటరాపరబిలిటీ చేతనం చేయును. TLS ప్రొటోకాల్ అనునది క్లైంట్-సర్వర్ అనువర్తనాలను నెట్వర్కునందు మూడోకంటపడకుండా ఎవరిచే సవరించబడకుండా సంప్రదించుకొనునట్లు అనుమతించును.

HMAC-SHA2 అల్గార్దెమ్ యొక్క OpenSSH తోడ్పాటు

Red Hat Enterprise Linux 6.5 నందు, SHA-2 క్రిప్టోగ్రఫిక్ హాష్ ఫంక్షన్ అనునది యిప్పుడు హాష్ మెసేజ్ ఆథెంటికేషన్ కోడ్ (MAC) వుత్పత్తి చేయుటలో వుపయోగించవచ్చు, అది దత్తాంశ సమైఖ్యతను మరియు తనిఖీను OpenSSH నందు చేతనంచేయును.

OpenSSL నందు ప్రిఫిక్స్ మాక్రో

openssl స్పెక్ ఫైల్ ఇప్పుడు ప్రిఫిక్స్ మాక్రో వుపయోగించును, అది openssl ప్యాకేజీలను తిరిగిగుర్తించుటకై వాటిని తిరిగినిర్మించుటకు అనుమతించును.

NSA Suite B క్రిప్టోగ్రఫీ తోడ్పాటు

Suite B అనునది దాని క్రిప్టోగ్రఫిక్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ నందు భాగముగా NSA చేత తెలుపబడిన క్రిప్టోగ్రఫిక్ అల్గార్దెమ్స్ సమితి. అది క్లాసిఫై కాని సమాచారం మరియు అత్యంత క్లాసిఫైడ్ సమాచారం మధ్యన ఇంటరాపరబుల్ క్రిప్టోగ్రఫిక్ బేస్ వలె సేవచేయును. అది వీటిని కలిగివుంటుంది:
  • అధునాతన ఎన్క్రిప్షన్ ప్రమాణం (AES) కీ పరిమాణాలు 128 మరియు 256 బిట్లతో. ట్రాఫిక్ ఫ్లో కొరకు, AES అనునది తక్కువ బాండ్‌విడ్త్ ట్రాఫిక్ కొరకు కౌంటర్ రీతి (CTR) తో వుపయోగించాలి లేదా ఎక్కువ బాండ్‌విడ్త్ ట్రాఫిక్ కొరకు Galois/Counter రీతి (GCM) తో మరియు సిమెట్రిక్ ఎన్క్రిప్షన్‌తో వుపయోగించాలి.
  • ఎలిప్టిక్ కర్వ్ డిజిటల్ సిగ్నేచర్ అల్గార్దెమ్ (ECDSA) డిజిటల్ సంతకాలు.
  • ఎలిప్టిక్ కర్వ్ డిఫైన్-హెల్మన్ (ECDH) కీ ఒప్పందం.
  • సెక్యూర్ హాష్ అల్గార్దెమ్ 2 (SHA-256 మరియు SHA-384) సందేశం డైజెస్ట్.

భాగస్వామ్య వ్యవస్థ ధృవీకరణపత్రాలు

సర్టిఫికేట్ ట్రస్ట్ డెసిషన్స్ కొరకు ఇన్పుట్ వలె క్రిప్టో టూల్‌కిట్స్ చేత వుపయోగించబడె స్టాటిక్ దత్తాంశం యొక్క వ్యవస్థ-వ్యాప్త ట్రస్ట్ స్టోర్‌ను చేతనం చేయుటకు వ్యవస్థ ధృవీకరణపత్ర ఎంకర్లు మరియు బ్లాక్‌లిస్ట్ సమాచారం తెచ్చుట కొరకు అప్రమేయ మూలాన్ని పంచుకొనుటకు NSS, GnuTLS, OpenSSL మరియు Java జాబితాలో చేర్చబడినవి. ధృవీకరణపత్రాల వ్యవస్థ-వ్యాప్త నిర్వహణ అనునది సులువైన వుపయోగంకు సహాయంచేయును మరియు స్థానిక ఎన్విరాన్మెంట్లకు మరియు కార్పోరేట్ డిప్లోయ్‌మెంట్లకు అవసరం.

గుర్తింపు నిర్వహణ నందు కేంద్రీయంగా స్థానిక వాడుకరుల స్వయంచాలక సింక్రొనైజేషన్

గుర్తింపు నిర్వహణ నందు కేంద్రీయంగా స్థానిక వాడుకరుల స్వయంచాలక సింక్రొనైజేషన్ అనునది Red Hat Enterprise Linux 6.5 నందు స్థానిక వాడుకరులను సులువుగా కేంద్రీయంగా నిర్వహించునట్లు చేస్తుంది.

NSS నందు ECC తోడ్పాటు

Red Hat Enterprise Linux 6.5 నందు నెట్వర్కు భద్రతా సేవలు (NSS) ఇప్పుడు ఎలిప్టిక్ కర్వ్ కిప్టోగ్రఫీ (ECC) తోడ్పాటునిచ్చును.

Chapter 4. సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ

Red Hat తోడ్పాటు సాధనం

Red Hat Enterprise Linux 6.5 కొత్త ప్యాకేజీ కలిగివుంది, redhat-support-tool, అది Red Hat తోడ్పాటు సాధనం అదించును. ఈ సాధనం అనునది కన్సోల్-ఆధారిత ఏక్సెస్‌ను Red Hat సబ్‌స్క్రైబర్ సేవలకు అందించును మరియు Red Hat సబ్‌స్క్రైబర్లు Red Hat వినియోగదార్లవలె వారికి అందుబాటులో వున్న కాంటెంట్ మరియు సేవలను రెంటినీ ఏక్సెస్ చేయుటకు మరిన్ని వెన్యూలను అందించును. ఇంకా, ఇది వినియోగదారులు వారి హెల్పుడెస్క్ సేవలను మా సబ్‌స్క్రిప్షన్ సేవలతో సమైఖ్య పరచుటకు అనుమతించును. ఈ ప్యాకేజీ సామర్ధ్యాలు వీటిని కలిగివున్నాయి:
  • కన్సోల్ నుండి సమాచార నిధి వ్యాసం మరియు పరిష్కారం దర్శించవచ్చు (man పేజీల వలె రూపొందించిన)
  • కన్సోల్ నుండి వినియోగదారి కేస్‌లు దర్శించుట, సృష్టించుట, సవరించుట, మరియు వ్యాఖ్యానించుట.
  • వినియోగదారి కేస్‌కు లేదా ftp://dropbox.redhat.com/ కు కన్సోల్ నుండి నేరుగా అనుబందం ఎక్కించుట.
  • పూర్తి ప్రోక్సీ తోడ్పాటు (అనగా, FTP మరియు HTTP ప్రోక్సీలు).
  • కన్సోల్ నుండి వినియోగదారి కేసులకు అనుబందాలను సులువుగా జాబితాచేయుట మరియు దించుట.
  • క్వరీ పదాలు, లాగ్ సందేశాలు, మరియు ఇతర పారామితుల పై సమాచార నిధి అన్వేషించుట మరియు అన్వేషణ ఫలితాలను ఎంపికచేయదగ్గ జాబితానందు చూడుట.
  • విశ్లోషణ కొరకు లాగ్ ఫైళ్ళను, పాఠం ఫైళ్ళను, మరియు ఇతర వనరులను షాడోమాన్ ఆటోమాటిక్ ప్రాబ్లమ్ డిటర్మినేషన్ ఇంజన్‌కు సులువుగా ఎక్కించుట.
  • వివిధ ఇతర తోడ్పాటు-సంబంద ఆదేశాలు.
Red Hat తోడ్పాటు సాధనం గురించి మరింత సమాచారం కొరకు, సంస్థాపిత పత్రకీకరణను /usr/share/doc/redhat-support-tool-version/ సంచయం నందు లేదా కింది సమాచార నిధి వ్యాసం చూడండి: https://access.redhat.com/site/articles/445443.

subscription-manager list యొక్క నవీకరణలు

అందుబాటులోని సబ్‌స్క్రిప్షన్ జాబితా నందు, subscription-manager list --available ఆదేశం యొక్క అవుట్పుట్ ఇప్పుడు కొత్త క్షేత్రం కలిగివుంది, Provides. ఈ క్షేత్రం అనునది వ్యవస్థకు అర్హత వున్న వుత్పత్తుల పేర్లను చూపును. అదనంగా, కొత్త క్షేత్రం, Suggested, అను క్షేత్రం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ (GUI) తో పారిటీ అందించుటకు మరియు కంపైలెన్స్ ఇచ్చుటకు జతచేయబడెను.

Chapter 5. వర్చ్యులైజేషన్

Red Hat Enterprise Linux 6.5 నందు వర్చ్యులైజేషన్ నవీకరణలు అనునవి లైవ్ మైగ్రేషన్, దోషం నివేదించుట, హార్డువేర్ మరియు సాఫ్టువేర్ సారూప్యత వంటి వివిధ ప్రాంతాలలో చాలా బగ్ పరిష్కారాలను కలిగివున్నాయి. దానికి అధనంగా, పనితనం మరియు సాధారణ స్థిరత్వం వంటి వాటికి మెరుగుదలలు చేయబడినవి. ఈ మార్పులలో ముఖ్యమైన వాటి కొరకు, కింది విభాగాలను చూడుము.

5.1. KVM

VMDK చిత్ర ఫైలు ఫార్మాట్ కు తోడ్పాటు మెరుగుపరచబడెను

చాలా VMware వుత్పత్తుల చేత సృష్టించబడిన, వర్చ్యువల్ మిషన్ డిస్కుకు, లేదా VMDK, చిత్ర ఫైల్ ఫార్మాట్లకు, వాటి వుపఫార్మాట్లతో సహా, అన్నిటికీ గల చదువుటకు-మాత్రమే తోడ్పాటుకు Red Hat Enterprise Linux 6.5 చాలా మెరుగుదలలను కలిగివుంది.

విండోస్ అతిథి ఏజెంట్ పూర్తిగా తోడ్పాటునిచ్చును

విండోస్ అతిథి ఏజెంట్ అనునది ఇప్పుడు పూర్తిగా తోడ్పాటునిచ్చును మరియు వర్టియో-విన్ డ్రైవర్లతో సహా సప్లిమెంటరీ ఛానల్ నందు స్వంత సంస్థాపికతో అందించబడును.

VHDX చిత్ర ఫైల్ ఫార్మాట్ కు తోడ్పాటు

Red Hat Enterprise Linux 6.5 అనునది Hyper-V వర్చ్యువల్ హార్డు డిస్కుకు, లేదా Microsoft Hyper-V చేత సృష్టించబడిన VHDX, చిత్ర ఫార్మాట్లకు, చదువట-మాత్రమే తోడ్పాటును కలిగివుంది.

QEMU నందు GlusterFS కొరకు స్వాభావిక తోడ్పాటు

QEMU నందు GlusterFS కొరకు స్వాభావిక తోడ్పాటు అనునది GlusterFS వాల్యూమ్‌లకు స్థానికంగా మౌంటైన FUSE ఫైల్ వ్యవస్థ ద్వారా కాకుండా libgfapi లైబ్రరీ వుపయోగించి స్వాభావిక ఏక్సెస్ అనుమతించును. ఈ స్వాభావిక విధానం అనునది పనితనంలో చెప్పుకోదగ్గ మెరుగుదలలను అందించును.

లైవ్ వర్చ్యువల్ మిషన్ల బాహ్య బ్యాకప్ కొరకు తోడ్పాటు

అతిధేయ పై నడుచుచున్న ముడో-వ్యక్తి అనువర్తనాలు ఇప్పుడు అతిథి చిత్ర విషయాలను చదువుటకు-మాత్రమే రూపంలో ఏక్సెస్ చేయగలవు, అయినా ఫైళ్ళను నకలుతీయగలవు మరియు బ్యాకప్లు నడుపగలవు.

లైనక్స్ అతిథుల కొరకు CPU హాట్ ప్లగ్గింగ్

లైనక్స్ అతిథులపై QEMU అతిథి ఏజెంట్ యొక్క సహాయంతో CPU హాట్ ప్లగ్గింగ్ మరియు హాట్ అన్‌ప్లగ్గింగ్ అనునవి తోడ్పాటునిచ్చును; అతిథి నడుచునప్పుడు CPU లు అనునవి చేతనం కాగలవు లేదా అచేతనం కాగలవు, అయినా హాట్ ప్లగ్ లేదా హాట్ అన్‌ప్లగ్ అనుకరించును.

qemu-ga-win పై VSS తోడ్పాటుతో Microsoft Windows పైన అనువర్తనం-ఎరిగిన freeze మరియు thaw

VSS (వాల్యూమ్ షాడో కాపీ సర్వీస్) అనునది Microsoft Windows API అది, ఇతరములతో కలిపి, సరైన, స్థిరమైన freeze మరియు thaw చర్యల కొరకు అనువర్తనాల గమనికలను అనుమతించును. ఈ విశేషణంతో, వర్చ్యువల్ మిషన్ నడుచునప్పుడు తీసుకొనిన స్నాప్‌షాట్లు మొత్తం స్టాక్(బ్లాక్ లేయర్ నుండి అతిథి అనువర్తనాల వరకు) నందు స్థిరమైనవి మరియు బ్యాకప్ ప్రయోజనాల కొరకు వుపయోగించవచ్చు. మరింత సమాచారం కొరకు, చూడండి Virtualization Administration Guide

qemu-ga హుక్స్ వుపయోగించి లైనక్స్ పైన అనువర్తనం-ఎరిగిన freeze మరియు thaw

Windows VSS వర్షన్‌కు సమానమైన, అనువర్తనం-స్థిరమైన స్నాప్‌షాట్లు అనునవి అతిథి పైన నడుచుచున్న QEMU అతిథి ఏజెంట్‌కు అనుబందించిన స్క్రిప్టు వుపయోగంతో సృష్టించవచ్చు. ఈ స్క్రిప్టులు అనువర్తనాలకు తెలుపగలవు తద్వారా అవి freeze లేదా thaw చర్య నందు వాటి దత్తాంశంను డిస్కుకు త్రోసివేయును, అయినా స్థిరమైన స్నాప్‌షాట్లు తీసుకొనుటకు అనుమతించును.

VMware OVF మరియు Citrix Xen అతిథులు అనునవి KVM అతిథులుగా మారుట

VMware ఓపెన్ వర్చ్యులైజేషన్ ఫార్మాట్ (OVF) మరియు Citrix Xen అతిథి అనునవి KVM కు మారుటను తోడ్పాటునిచ్చుటకు virt-v2v కన్వర్షన్ సాధనం అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.

KVM మెమొరీ స్కేలబిలిటీ పెంచబడెను

ఒక అతిథి నందు KVM వర్చ్యువల్ మెమొరీ స్కేలబిలిటీ అనునది 4TB కు పెంచబడెను.

Microsoft Windows అతిథుల నందు వాల్యూమ్ కంట్రోల్ తోడ్పాటు

Microsoft Windows XP అతిథుల నందు AC'97 కోడెక్ వుపయోగించి వాడుకరులు యిప్పుడు వాల్యూమ్ స్థాయిని పూర్తిగా నియంత్రించవచ్చు.

5.2. Microsoft Hyper-V

Microsoft Hyper-V పాక్షిక-వర్చ్యులైజ్డు డ్రైవర్లు

Red Hat Enterprise Linux తోడ్పాటును Microsoft Hyper-V పై విస్తరించుటకు, సింథటిక్ వీడియో ఫ్రేమ్ బఫర్ డ్రైవర్ Red Hat Enterprise Linux 6.5 కు జతచేయబడెను. అదనంగా, అతిథి మరియు అతిధేయ మద్యని సిగ్నలింగ్ ప్రొటోకాల్ నవీకరించబడెను. మరింత సమాచారం కొరకు, చూడండి Virtualization Administration Guide

5.3. VMware

VMware ప్లాట్‌ఫాం డ్రైవర్ల నవీకరణలు

VMware నెట్వర్కు యొక్క పాక్షిక-వర్చ్యులైజ్డు డ్రైవర్ అనునది సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.

Chapter 6. నిల్వ

fsfreeze పూర్తి తోడ్పాటు

fsfreeze సాధనం అనునది Red Hat Enterprise Linux 6.5 నందు పూర్తి తోడ్పాటునిచ్చును. fsfreeze ఆదేశం అనునది డిస్కుపైన ఫైల్ వ్యవస్థకు ఏక్సెస్‌ను నిలిపివేయును. fsfreeze అనునది హార్డువేర్ RAID పరికరాలతో వుపయోగించుటకు రూపొందించబడెను, వాల్యూమ్ స్నాప్‌షాట్లు సృష్టించుటలో సహాయపడుతూ. fsfreeze సౌలభ్యంపై మరిన్ని వివరాల కొరకు, fsfreeze(8) man పేజీ చూడండి.

pNFS ఫైల్ లేఅవుట్ సంభాలన

భౌతిక నిల్వ పరికరాలకు నేరుగా మరియు సమాంతరంగా దత్తాంశమును వ్రాయుటకు మరియు చదువుటకు కంప్యూట్ క్లైంట్లను అనుమతించుచూ, సాంప్రదాయ NFS వ్యవస్థలను సాంప్రదాయ NAS ఎన్విరాన్మెంట్ల నందు స్కేల్ అవుట్ చేయుటకు pNFS అనుమతించును. చాలా క్లైంట్ల నుండి చాలా పెద్ద సమితులకు ఊహించదగ స్కేలబుల్ ఏక్సెస్ అనుమతించుచూ, మెటా-డాటా మరియు కోఆర్డినేట్ ఏక్సెస్ నియంత్రించుటకు మాత్రమే NFS సేవిక వుపయోగించబడును. ఈ విడుదులనందు pNFS కు బగ్ పరిష్కారాలు అందించబడుచున్నవి.

FUSE నందు Red Hat నిల్వ తోడ్పాటు

కెర్నల్ నందు ఎటువంటి సవరణలు లేకుండా వాడుకరి స్పేస్ నందు ఫైల్ వ్యవస్థల అభివృద్దిని చేతనం చేయునదే FUSE (ఫైల్‌సిస్టమ్ ఇన్ యూజర్ స్పేస్). Red Hat Enterprise Linux 6.5 అనునది FUSE వుపయోగించే యూజర్ స్పేస్ ఫైల్ సిస్టమ్సుకు పనితనపు విస్తరింపులను అందించును, ఉదాహరణకు, GlusterFS (Red Hat నిల్వ).

LVM థిన్ ప్రొవిజనింగ్ మరియు స్నాప్‌షాట్లు

థిన్ ప్రొవిజనింగ్‌ను చేర్చుటకు లాజికల్ వాల్యూమ్ నిర్వాహిక నవీకరించబడెను, ఇది వాడుకరులను వారి యథార్ధ నిల్వ అవసరాలకు తగినట్లు వారి నిల్వ సామర్ధ్యపు పెట్టుబడిని ఆప్టిమైజ్ చేసుకొనుటకు అనుమతించును. భాగస్వామ్య నిల్వ పూల్ నుండి తైనీ-ప్రొవిజన్డ్ వాల్యూమ్‌లను ఇప్పుడు వాడుకరులు సృష్టించగలరు. వాల్యూమ్ వ్రాయబడినప్పుడే పూల్ నందు బ్లాక్‌లు కేటాయించబడును, వాల్యూమ్ నందు దత్తాంశం తీసివేయబడినప్పుడు బ్లాక్‌లు పూల్‌కు తిప్పిపంపబడును. అదనంగా, స్నాప్‌షాట్లు, లేదా పాయింట్-ఇన్-టైమ్ నకళ్ళు, గతంలో ఫలానా సమయంలో వాల్యూమ్ పైన వున్నట్లుగానే దత్తాంశం కు ఏక్సెస్ అందించును. దత్తాంశం చెరిపి-వ్రాయబడుటకు ముందుగా దానిని ప్రిజర్వ్ చేయుట ద్వారా యిది సంభవం.

మల్టీపాత్ I/O నవీకరణలు

స్కేలబిలిటీ మరియు Device Mapper Multipath యొక్క సులువుగా-వుపయోగించే-విధానం మెరుగుపరచబడెను. ఈ మెరుగుదలలు ఫలానా దానిలో చేర్చబడెను:
  • సౌలభ్యాల ప్రతిస్పందకత
  • మల్టీ‌పాత్ పరికరం స్వయచాలకంగా పేరుపెట్టుట,
  • అత్యంత స్పష్టమైన మల్టీపాత్ లక్ష్యపు గుర్తింపు.

GFS2 నందు పనితనం మెరుగుదలలు

నిజంగా వొకదానికి వొకటి సంబందించిన మరియు కలిపి ఏక్సెస్ చేయగలిగిన ఫైళ్ళ కొరకు మంచి లోకాలిటీను అందించే Orlov block ఎలొకేటర్‌ ను Red Hat Enterprise Linux 6.5 పరిచయం చేస్తోంది. అదనంగా, వనరుల సమూహాలు మధ్యస్థంగా వున్నప్పుడు, పనితనం మెరుగుపరచుటకు వేరే సమూహం వుపయోగించును.

mdadm నందు TRIM తోడ్పాటు

RAID0, RAID1, RAID10 మరియు RAID5 కొరకు mdadm సాధనం ఇప్పుడు TRIM సందేశాలకు తోడ్పాటునిచ్చును.

Chapter 7. క్లస్టరింగ్

pcs పూర్తిగా తోడ్పాటునిచ్చును

pcs ప్యాకేజీ, గతంలో సాంకేతిక ముందస్తువీక్షణం వలె చేర్చబడింది, ఇప్పుడు Red Hat Enterprise Linux 6.5 నందు పూర్తిగా తోడ్పాటునిస్తోంది. ఈ ప్యాకేజీ corosync మరియు pacemaker సౌలభ్యాలు ఆకృతీకరించుటకు మరియు నిర్వహించుటకు ఆదేశ-వరుస సాధనం అందించును.

pacemaker పూర్తిగా తోడ్పాటునిస్తోంది

Pacemaker, ఒక స్కేలబుల్ హై-ఎవైలబిలిటీ క్లస్టర్ రిసోర్స్ నిర్వాహిక, ఇది గతంలో సాంకేతిక ముందస్తువీక్షణం వలె చేర్చబడింది, ఇప్పుడు పూర్తిగా తోడ్పాటునిస్తోంది.

Chapter 8. హార్డువేర్ చేతనపరచుట

భవిష్య Intel SOC ప్రోసెసర్లకు తోడ్పాటు

భవిష్య Intel సిస్టమ్-ఆన్-చిప్ (SOC) ప్రోసెసర్స్ కొరకు ఆపరేటింగ్ సిస్టమ్ నందు పరికర తోడ్పాటు చేతనమైంది. ఇవి డ్యూయల్ ఆటమ్ ప్రోసెసర్స్, మెమొరీ నియంత్రిక, SATA, యూనివర్సల్ ఎసింక్రొనస్ రిసీవర్/ట్రాన్సుమిటర్, సిస్టమ్ మానేజ్‌మెంట్ బస్ (SMBUS), USB మరియు Intel లెగసీ బ్లాక్ (ILB, lpc, timers, SMBUS (i2c_801 మాడ్యూల్)) కలిగివున్నాయి.

12Gbps LSI SAS పరికరాల తోడ్పాటు

mpt3sas డ్రైవర్ అనునది 12Gbps SAS పరికరాల కొరకు LSI నుండి Red Hat Enterprise Linux నందు తోడ్పాటును జతచేయును.

డైనమిక్ హార్డువేర్ విభజనీకరణ మరియు వ్యవస్థ బోర్డ్ స్లాట్ గుర్తింపు తోడ్పాటు

డైనమిక్ హార్డువేర్ విభజనీకరణ మరియు సిస్టమ్ బోర్డ్ స్లాట్ రికగ్నిషన్ విశేషణాలు అనునవి రికగ్నిషన్ కొరకు హై-లెవల్ సిస్టమ్ మిడిల్‌వేర్ లేదా అనువర్తనాలను ఎలర్ట్ చేయును మరియు వాడుకరులు వ్యవస్థను పునఃప్రారంభించకుండానే అదనపు పనిభారాలకు తోడ్పాటు నిచ్చునట్లు వ్యవస్థను పెంచుటకు అనుమతించును.

భవిష్య Intel 2D మరియు 3D గ్రాఫిక్స్ కు తోడ్పాటు

భవిష్య Intel 2D మరియు 3D గ్రాఫిక్స్ కొరకు తోడ్పాటు జతచేయబడెను అది వ్యవస్థలను భవిష్య Intel ప్రోసెసర్లను Red Hat హార్డువేర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా సర్టిఫై చేయుటకు అనుమతించును.

ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ ఫీడ్‌బాక్ మానిటర్

ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ ఫీడ్‌బాక్ మానిటర్ అనునది ఆపరేటింగ్ వ్యవస్థకు మంచి సమాచారం అందించును తద్వారా అది విద్యుత్‌ను ఆదా చేస్తూ మంచి ఫ్రీక్వెన్సీ చేంజ్ నిర్ణయాలను తీసుకొనును.

ECC మెమొరీ తోడ్పాటు

భవిష్య తరం AMD ప్రోసెసర్స్ కొరకు ఎర్రర్-కరెక్టింగ్ కోడ్ (ECC) మెమొరీ చేతనం చేయబడెను. కౌంటర్స్ మరియు స్థితి బిట్లకు సంబందించిన ECC మెమొరీ ఏక్సెస్ చేస్తూ పనితనం మరియు దోషాల కొరకు పరిశీలించు సామర్ధ్యం అందించును.

1TB మెమొరీ కన్నా ఎక్కువ వున్న AMD వ్యవస్థల కొరకు తోడ్పాటు

AMD వ్యవస్థల పైన 1TB కన్నా యెక్కువ RAM తో వున్న మెమొరీ ఆకృతీకరణలను కెర్నల్ ఇప్పుడు తోడ్పాటునిచ్చును.

Chapter 9. పరిశ్రమ ప్రమాణాలు మరియు ధృవీకరణం

FIPS 140 పునఃనిర్థారణలు

ఫెడరల్ ఇన్ఫర్మేషన్ ప్రోసెసింగ్ స్టాన్డర్డ్స్ (FIPS) ప్రచురణలు 140 అనునది U.S. ప్రభుత్వపు భద్రతా ప్రమాణం అది భద్రతా వ్యవస్థ నందు సున్నితత్వాని కాపాడుతూ, అయితే క్లాసిఫైడ్ కాని సమాచారంను, వుపయోగించే క్రిప్టోగ్రఫిక్ మాడ్యూల్ చేత సంతృప్తి చెందాలి. ప్రమాణం అనునది నాల్గు వృద్దిచెందుతున్న, భద్రతా నాణ్యత స్థాయిలను అందించును: స్థాయి 1, స్థాయి 2, స్థాయి 3, స్థాయి 4. ఈ స్థాయిలు క్రిప్టోగ్రఫిక్ మాడ్యూళ్ళు నియమించే విస్తృత స్థాయి పొటెన్షియల్ అనువర్తనాలు మరియు ఎన్విరాన్మెంట్లను కవర్ చేయును. భద్రతా అవసరాలు అనునవి క్రిప్టోగ్రఫిక్ మాడ్యూల్ యొక్క అభివృద్ది మరియు భద్రతా రూపొందింపుకు సంబందించిన ప్రాంతాలను కవర్ చేయును. ఈ ప్రాంతాలు వీటిని కలిగివుండును, క్రిప్టోగ్రఫిక్ మాడ్యూల్ స్పెసిఫికేషన్, క్రిప్టోగ్రఫిక్ మాడ్యూల్ పోర్ట్స్ మరియు ఇంటర్ఫేసెస్; రోల్స్, సర్వీసెస్, మరియు ఆథెంటికేషన్; ఫైనైట్ స్టేట్ మోడల్; ఫిజికల్ సెక్యూరిటీ; ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్; క్రిప్టోగ్రఫిక్ కీ నిర్వహణ; ఎలక్ట్రోమాగ్నటిక్ ఇంటర్ఫేస్/ఎనక్ట్రోమాగ్నటిక్ కంపాటబిలిటీ (EMI/EMC); సెల్ఫ్ టెస్ట్స్; డిజైన్ ఎస్యూరెన్స్; మరియు ఇతర దాడుల మెటిగేషన్.
Red Hat Enterprise Linux 6.5 అనునది NSA Suite B క్రిప్టోగ్రఫీ విస్తరింపులు మరియు ధృవీకరణలకు తోడ్పాటునిచ్చును. ఈ క్రిప్టోగ్రఫిక్ అల్గార్దెమ్స్ అనునవి అత్యంత సురక్షిత నెట్వర్కింగ్ సంప్రదింపును అందించును. NIST 800 - 131 కిందని ప్రభుత్వ శాఖలకు NSA SUITE B అవసరం. NSA Suite B క్రిప్టోగ్రఫీ మూలకాలు కింది వాటిని కలిగివుండును:
  • ఎడ్వాన్సుడ్ ఎన్క్రిప్షన్ స్టాన్డర్డ్ (AES) ఎన్క్రిప్షన్ GCM ఆపరేషన్ మోడ్
  • ఎలిప్టిక్ కర్వ్ డిఫైన్-హెల్మన్ (ECDH)
  • సెక్యూర్ హాష్ అల్గార్దెమ్ 2 (SHA-256)
కింది లక్ష్యాలు నిర్థారణా కార్యక్రమంలో వున్నాయి:
  • NSS FIPS-140 స్థాయి 1
  • సూట్ B ఎలిప్టిక్ కర్వ్ క్రిప్టోగ్రఫీ (ECC)
  • OpenSSH (క్లైంట్ మరియు సర్వర్)
  • Openswan
  • dm-crypt
  • OpenSSL
  • కెర్నల్ క్రిప్టో
  • AES-GCM, AES-CTS, AES-CTR సైఫర్స్

FSTEK ధృవీకరణ

ఫారెన్ వెండార్స్ భద్రతా క్లైమ్స్ నిర్ణయించుటకు కామన్ క్రైటీరియా సర్టిఫికేషన్ తరువాత రష్యన్ పెడరేషన్ దాని స్వంత సర్టిఫికేషన్ ప్రోసెస్ చేసింది. ప్రత్యేకించి రష్యన్ ప్రభుత్వ శాఖలకు సమాచార భద్రతా వుత్పత్తులను మరియు సేవలను పంపిణీచేయుటకు ఫారెన్ వెండార్సుకు ఫెడరల్ సర్వీస్ ఫర్ టెక్నికల్ అండ్ ఎక్సుపోర్ట్ కంట్రోల్ (FSTEK) సర్టిఫికేషన్ కావాలి.
లైసెన్సింగ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టెక్నోలజీకు అదనంగా, FSTEK ఎజెన్సీ అనునది దేశపు ఎగుమతి నియంత్రణను కూడా గమనించును, సివిల్ మరియు మిలట్రీ అనువర్తనాలకు వుపయోగించగలిగే ద్వంద్వ-వినియోగ సాంకేతికతల ఎగుమతితో సహా.
ఉత్పత్తి అనునది వ్యక్తిగత సమాచారం నిల్వవుంచినా లేదా వుపయోగించినా లేదా ప్రోసెస్ చేసినా, ఫారెన్ వెండార్సుకు FSTEK సర్టిఫికేషన్ అనునది న్యాయసంభంద అవసరం మరియు రష్యన్ ఫెడరేషన్ నందు ఫెడరల్ మరియు కమర్షియల్ అమ్మకాలను Red Hat బ్రాండ్ కింద లెజిటిమైజ్ చేయును.
FSTEK సర్టిఫికేషన్ అనునది ఫలానా Red Hat Enterprise Linux 6 చిన్న విడుదలపై ఆధారపడి వుండదు కనుక సర్టిఫికేషన్స్ లైఫ్‌సైకిల్ నందు మొత్తం Red Hat Enterprise Linux 6 విడుదల అనుమతించును.

Chapter 10. డెస్కుటాప్ మరియు గ్రాఫిక్స్

గ్రాఫిక్స్ నవీకరణలు మరియు కొత్త హార్డువేర్ తోడ్పాటు

Red Hat Enterprise Linux 6.5 నందు గ్రాఫిక్స్ నవీకరణలు కింది వాటిని కలిగివున్నాయి:
  • భవిష్య Intel మరియు AMD పరికరాల కొరకు తోడ్పాటు
  • స్పైస్ మెరుగుదలలు
  • మల్టీ మానిటర్ తోడ్పాటు మరియు టచ్ స్క్రీన్ తోడ్పాటు మెరుగుపరచబడెను

నవీకృత gdm

gdm అనువర్తన నవీకరణల నందు సంకేతపదం గడువుకు చేందిన సందేశాలు, మల్టీ-సీట్ తోడ్పాటు మరియు స్థానిక ఇంటరాపరబిలిటి సమస్యలకు చెందిన పరిష్కారాలు కలిగివున్నాయి.

నవీకృత ఎవాల్యూషన్

Microsoft Exchange తో ఇంటరాపరబిలిటీను మెరుగుపరచుటకు ఎవాల్యూషన్ అనువర్తనం సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడినది. ఇది కొత్త ఎక్సుచేంజ్ వెబ్ సర్వీస్ (EWS), మెరుగైన సమావేశపు తోడ్పాటు మరియు మెరుగైన సంచయ తోడ్పాటు కలిగివుంది.

LibreOffice రీబేస్ అయింది

Red Hat Enterprise Linux 6.5 విడుదల నందు, LibreOffice అనునది అప్‌స్ట్రీమ్ వర్షన్ 4.0.4 కు నవీకరించబడింది.

AMD GPU ల కొరకు తోడ్పాటు

సరికొత్త AMD గ్రాఫిక్స్ ప్రోసెసర్ యూనిట్స్ (GPUs) కు తోడ్పాటు Red Hat Enterprise Linux 6.5 కు జతచేయబడెను

నెట్వర్కునిర్వాహిక నందు ఎలియాస్ తోడ్పాటు

నెట్వర్కునిర్వాహికకు ఎలియాస్ తోడ్పాటు జతచేయబడెను. ఏమైనప్పటికీ, వాడుకరులు బహుళ లేదా రెండవ ఐపి విశేషణాన్ని వుపయోగించమని గట్టిగా సిఫార్సు చేయడమైంది.

Chapter 11. పనితనం మరియు స్కేలబిలిటి

KSM విస్తరింపులు

కెర్నల్ షేర్డ్ మెమొరీ (KSM) అనునది పేజీలు కోయలెస్కింగ్ చేయునప్పుడు నాన్-యూనిఫాం మెమొరీ ఏక్సెస్ (NUMA) పరిగణించుటకు విస్తరించబడింది, అది వ్యవస్థపై అనువర్తనాల పనితనం మెరుగుపరచును. ఇంకా, Red Hat OpenShift కొరకు అందుబాటులోని అనువర్తనాల సాంద్రతను పెంచుటకు అదనపు పేజీ రకాలను చేర్చినది.

tuned నవీకరణలు

కొన్ని సినారియోలకు ఉత్తమ పనితనం అందించుటకు tuned ప్రొఫైల్స్ రిఫైన్ చేయబడినవి.

Chapter 12. కంపైలర్ మరియు సాధనములు

స్వయంచాలక బగ్ నివేదీకరణ సాధనం (ABRT), అప్రమేయ సెట్ నివేదికల నందు మార్పు

abrt-cli --report DIR ఆదేశం నడిపితే ఇప్పుడు కింది నివేదికల ఎంపికను చూపును:
మీరు సమస్యను ఎలా నివేదించాలని అనుకొనుచున్నారు?
 1) కొత్త Red Hat తోడ్పాటు కేస్
 2) ఇప్పటికే వున్న Red Hat తోడ్పాటు కేస్
 3) tar ఆర్కైవ్‌కు దాయి

కాంపోనెంట్ వర్షన్లు

ఈ ఎపెండిక్స్ అనునది Red Hat Enterprise Linux 6.5 విడుదల నందలి కాంపోనెంట్ల మరియు వాటి వర్షన్ల జాబితా.
కాంపోనెంట్
వర్షన్
కెర్నల్
2.6.32-421
QLogic qla2xxx డ్రైవర్
8.04.00.08.06.4-k
QLogic ql2xxx ఫర్మువేర్
ql23xx-firmware-3.03.27-3.1
ql2100-firmware-1.19.38-3.1
ql2200-firmware-2.02.08-3.1
ql2400-firmware-7.00.01-1
ql2500-firmware-7.00.01-1
Emulex lpfc డ్రైవర్
8.3.7.21.1p
iSCSI ఇనిషియేటర్ యుటిల్స్
iscsi-initiator-utils-6.2.0.873-9
DM-Multipath
device-mapper-multipath-0.4.9-71
LVM
lvm2-22.02.100-4
Table A.1. కాంపోనెంట్ వర్షన్లు

పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

Revision History
Revision 1.0-7Thu Nov 21 2013Eliška Slobodová
Red Hat Enterprise Linux 6.5 విడుదల నోట్స్ యొక్క విడుదల.
Revision 1.0-3Thu Oct 3 2013Eliška Slobodová
Red Hat Enterprise Linux 6.5 బీటా విడుదల నోట్స్ యొక్క విడుదల.